Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో సమంత సినిమా నిర్మాణంలో కూడా అడుగుపెట్టింది. సమంత త్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి ”శుభం” అనే సినిమాని నిర్మించింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో శ్రియ కొంఠం, హర్షిత్ మల్గిరెడ్డి, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని సమంత ప్రకటించింది. ఈ సినిమాని మే 9న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.