Samantha : సమంత (Samantha) నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటుంది. తాజాగా సమంత రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే వార్త హాట్ టాపిక్ అయింది. ”ది ఫ్యామిలీ మ్యాన్ 2” మరియు సిటాడెల్ వంటి సిరీస్‌లలో సమంత నటించింది. అయితే ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు సమంత, రాజ్ నిడిమోరు మధ్య బంధం ఏర్పిడినట్లు తెలుస్తుంది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇటీవల, రాజ్ తో సమంత దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా మరోసారి సమంత ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో సమంత వేలికి వజ్రపు ఉంగరం ఉంది. ఈ క్రమంలో సమంత, రాజ్ నిడిమోరు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు అని సమాచారం. త్వరలోనే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని ఇండస్ట్రీ సన్నిహితులు అంటున్నారు.