Homeసినిమాగుండమ్మకథలో సమంత, రష్మిక

గుండమ్మకథలో సమంత, రష్మిక

తెలుగులో 1962లో వచ్చిన గుండమ్మకథ చిత్రం అప్పట్లో పెద్ద సంచలనం. అప్పటి అగ్ర హీరోలు ఎన్టీఆర్​,ఏఎన్​ఆర్​ అన్నాదమ్ములుగా వారికి జోడీగా సావిత్రి, జమున అక్కాచెల్లెల్లుగా నటించి సినిమా అంచనాలను ఎక్కడికో తీసుకుపోయారు. అంతే కాకుండా చిత్రం ఘనవిజయం సాదించి ఇప్పటికీ చాలా మంది ఇష్టపడే చిత్రంగా నిలిచింది. ఆ తరువాత అటువంటి కథ, దాన్ని కాస్త మార్పులు చేస్తూ అనేక సినిమాలు తెలుగుతో పాటు అన్ని భాషలలో వచ్చాయి. అవన్నీ కూడా హిట్లుగానే నిలిచాయి.

అయితే తాజాగా సమంత, రష్మిక కూడా అచ్చు ఇటువంటి కథలోనే నటనకు ప్రధాన్యమున్న చిత్రంలో నటించేందుకు సిద్దమయ్యారట. తెలుగులో ఓ దర్శకుడు ఈ కథను ఇద్దరికీ వినిపించగా వెంటే ఓకే చెప్పేసారట. కథ నేటి సినిమాలకు అనుగుణంగా ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో వీరికి జోడీగా హీరోలు ఎవరు నటిస్తున్నారన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ ఇద్దరు హీరోయిన్లకు తెలుగులో మంచి క్రేజ్​ ఉండడంతో చిన్న హీరోలను పెట్టినా సినిమా బాగానే ఆడుతుందని అంచనాలు వేసుకుంటున్నారట.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img