పుష్ప 2 కోసం బన్నీ ఫాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ఫాన్స్ కె ఇలా ఉంటె బన్నీ ఈ సినిమా కోసం తన లుక్ డాన్స్ టోటల్ స్టైల్ నే మార్చేసి తెగ కష్టపడుతున్నాడు ఇక సుకుమార్ అయితే.. పుష్ప ను మించి పుష్ప 2 ఉండాలని ఒక శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నాడు. ఇప్పటికే ఈచిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్.. ఆ విషయాన్నీ చెప్పకనే చెప్పుకొచ్చాయి. ఇక ఆగస్టు 15 కు పుష్ప 2 ను రిలీజ్ చేయాలనీ మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఆగస్టు 15 చాలా మంచి డేట్. ఆరోజు మిస్ అయితే..అలాంటి డేట్ దొరకడం కష్టం. ఇప్పటికే ఆ డేట్ ను లాక్ చేసి పెట్టారు. అప్పటిలోగా షూటింగ్ ఫినిష్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను మొదలుపెట్టకపోతే.. ప్రమోషన్స్ కు టైమ్ దొరకదు. అంతేకాకుండా సినిమా ఇంకా పూర్తి కాకపోతే వేరేవాళ్లు వచ్చి డేట్ ను లాక్ చేసుకొనే ప్రమాదం ఉంది. అందుకే ఎలాగైనా షూటింగ్ ను పూర్తిచేయడానికి సుకుమార్ ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమాతో సుకుమార్.. ప్రేక్షకుల అంచనాలను నిలబెడతాడా.. ? అల్లు అర్జున్ మరో జాతీయ అవార్డు ను అందుకుంటాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.