Homeహైదరాబాద్latest Newsసమ్మక్క సారలమ్మకు కారెత్తు బంగారం సమర్పించిన యువకుడు

సమ్మక్క సారలమ్మకు కారెత్తు బంగారం సమర్పించిన యువకుడు

ఇదే నిజం, కోహెడ : సమ్మక్క సారలమ్మ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. కోరిన కోరిక తీరితే.. నిలువెత్తు బంగారం సమర్పిస్తామంటూ మొక్కుకున్న భక్తులు తులాభారాలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. బంగారం అంటే.. పసిడి కాదండోయ్.. బెల్లం. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో అమలవుతోంది. సాధారణంగా అయితే.. భక్తులు తమ పిల్లలకు తులాభారం నిర్వహించి నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే.. ఓ విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రేవోజు రమణాచారి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన యువ భక్తుడు తీర్చుకున్న మొక్కు.. అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను కూడా నిలువెత్తు బంగారంతో మొక్కు తీర్చుకున్నాడు. అయితే.. అది తమ పిల్లలకో, భార్యకో కాదండోయ్.. తన ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న కారుకు. తన కారుకు బెల్లంతో తులాభారం వేసి, 1,340 కేజీలు బరువు రూ.52,000 ఖర్చుతో నిలువెత్తు బంగారం సమర్పించి.. మొక్కు చెల్లించుకున్నాడు. ఈ ఆసక్తికర సన్నివేశం బెజ్జంకి మండల్ వీరాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.c

Recent

- Advertisment -spot_img