Homeహైదరాబాద్latest Newsఇసుక లారీలు తనిఖీ చేసిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు

ఇసుక లారీలు తనిఖీ చేసిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు

ఇదే నిజం, మంథని : పెద్దపల్లి జిల్లా మానేరు నదిలో కొనసాగుతున్న పలు ఇసుక క్వారీల అక్రమాలపై, రవాణాపై దాదాపు 25 కోట్ల రూపాయల జరిమానా విధించి, మానేరు చెక్ డ్యామ్ ల పరిధిలో కొనసాగుతున్న ఇసుక క్వారీల అక్రమ రవాణాను వెంటనే నిలిపివేయాలని ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ మరియు మైనింగ్, పోలీస్ శాఖలు…!ఈరోజు మంథని ప్రాంతంలో వందలాది ఇసుక లారీలను నిలిపివేసి, మానేరు నది క్వారీల వే బిల్లులు ఉంటే సీజ్ చేస్తున్న వైనం. పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ పరిధిలో ఉన్న మానేరు నదిలో గత ప్రభుత్వం చెక్ డ్యామ్ ల నిర్మాణం మాటున డిసల్టేషన్ పేరిట భారీగా ఇసుక క్వారీలకు ఎలాంటి ప్రమాణాలు, నిబందనలు పాటించకుండా అనుమతులు ఇచ్చారు. దాంతో పలు సంస్థలు తమ ఇస్టానుసారంగ లక్షల కొద్దీ టన్నులు కొండల మాదిరిగా ఇసుక డంపు చేసి రవాణా చేశారు. దీనిపై పలు సంస్థలు, వ్యక్తులు పలు న్యాయ స్థానాల్లో కేసులు వేయగా, హైదరాబాద్ కు చెందిన “ఔరా “లా ఫర్మ్ కు చెందిన న్యాయవాది కరణం రాజేష్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ లో కేసు దాఖలు చేసారు. కాగా ఇటీవల గ్రీన్ ట్రిబ్యునల్ అక్రమంగా అనుమతులు ఇచ్చిన నీటి పారుదల శాఖ, మైనింగ్ శాఖలకు 25 కోట్ల జరిమానా విదిస్తూ, ఇసుక క్వారీలు నిలిపి వేయాలని ఆదేశాలు ఇస్తూ… దాదాపు 27 సంస్థలకు, ప్రభుత్వ శాఖలకు ప్రతి వాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేశారు.ఈ మేరకు ఇన్ని ఏండ్లు మంథని రోడ్లపై మరణ మృదంగం మోగించి, రోడ్లన్నీ నాశనం చేసిన ఇసుక లారీలు ఇప్పుడు మంథని ప్రాంతంలో తనిఖీల పేరిట ఆపడం… అక్రమంగా ఉంటే సీజ్ చేస్తుంటే, లారీల ప్రవాహం కిలోమీటర్ల మేర మంథని నుండి గాడుదుల గండి వరకు నిలిపి ఉంచిన విషయాన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. కాగా ఈ ఆదేశాలు ఎన్ని రోజులు ఉంటాయి…వాహన దారుల ప్రయాణం ఎన్ని రోజులు క్షేమంగా చేస్తారు అన్న విషయం పట్ల సర్వత్రా ఉత్కంఠ వ్యక్తమౌతుంది.

Recent

- Advertisment -spot_img