Homeహైదరాబాద్latest Newsమానవతా దృక్పథం చాటుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మానవతా దృక్పథం చాటుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఇదే నిజం, ముస్తాబాద్: పోత్గల్ పరిధిలో పర్యటిస్తున్న సమయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తన వాహనంలో వెళ్తుండగా ఒక పాపతో మహిళ వాహనానికి అడ్డుగా వచ్చారు. దీంతో కలెక్టర్ వాహనం నుంచి వెంటనే దిగి ఆమె వివరాలు అడిగారు. తన తన పాపకు తీవ్రమైన జ్వరం వచ్చిందని అలాగే ఫిట్స్ కూడా ఉన్నాయని సహాయం అందించాలని వేడుకోగా, స్పందించిన కలెక్టర్ వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకి తరలించారు. అక్కడే కొద్ది సమయం ఉండి వైద్యులతో మాట్లాడారు. పాపకు మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు. పాప జ్వరం, ఫిట్స్ తో బాధపడుతుందని వైద్యులు తెలిపారు. సకాలంలో కలెక్టర్ మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించడంతో పాపకు ప్రాణాపాయం తప్పింది.

Recent

- Advertisment -spot_img