Homeహైదరాబాద్latest NewsSandeep Reddy Vanga : మహేష్ మూవీ లేనట్టే.. రామ్‌చరణ్‌తో ''డేవిల్'' మూవీ ఫిక్స్..!!

Sandeep Reddy Vanga : మహేష్ మూవీ లేనట్టే.. రామ్‌చరణ్‌తో ”డేవిల్” మూవీ ఫిక్స్..!!

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగా వరుస సినిమాల హిట్లతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ఉన్నారు. ”అర్జున్ రెడ్డి”, ”యానిమల్” సినిమాలతో తన రేంజ్ ఏంటో అందిరికి చూపించాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా ”స్పిరిట్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతుంది. ఈ క్రమంలో సందీప్ రెడ్డి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు హీరోగా సందీప్ రెడ్డి ”డేవిల్” అనే సినిమా చేయాలనీ ప్లాన్ చేసాడు. కానీ మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉండడంతో ఆ సినిమా లేట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ సినిమానే రామ్‌చరణ్‌ హీరోగా తీస్తున్నాడు అని సమాచారం.

ఇటీవలే సందీప్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ లను కలిసాడు. ఈ క్రమంలోనే ”డేవిల్” సినిమా కథను రామ్‌చరణ్‌ కు చెప్పగా దానికి చెర్రీ ఒకే చెప్పాడు అని తెలుస్తుంది. అయితే మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలనీ ట్రై చేసిన అది లేట్ కావడంతో రామ్‌చరణ్‌ తోనే తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సినిమా పూర్తయినా వెంటనే రామ్‌చరణ్‌ తో ”డేవిల్” సినిమా మొదలు పెట్టబోతున్నాడు అని సమాచారం.

Recent

- Advertisment -spot_img