– హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య
– నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఇదేనిజం, తెలంగాణబ్యూరో : దీపావళి పండుగపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో భారీ శబ్ధాలు చేసే బాణాసంచాలు కాల్చడంపై నిషేధం విధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహానగర ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు అమలు చేస్తున్నామని సీపీ పేర్కొన్నారు. జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో క్రాకర్స్ కాల్చడం పూర్తిగా నిషేధిస్తున్నామన్నారు. అంతేకాదు రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే శబ్ధం చేసే క్రాకర్స్ కాల్చాలని సూచించారు. నవంబర్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15వ తేదీ ఉదయం 6 గంటల మధ్య ఈ ఉత్తర్వులు అమలు అవుతాయన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.