ఇదేనిజం, వెబ్ డెస్క్ : గుజరాత్ టైటాన్స్ మహ్మద్ షమీ స్థానంలో యువ పేసర్ ను తీసుకుంది. కేరళకు చెందిన సందీప్ వారియర్ ను కనీస ధర 50 లక్షలకు కొనుగోలు చేసింది. వన్డే వరల్డ్‌కప్ లో గాయపడ్డ షమీ పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ఇటీవలే కాలి మడమ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ..ఈ ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు.