Homeహైదరాబాద్latest Newsపడకేసిన పారిశుధ్యం

పడకేసిన పారిశుధ్యం

ఇదే నిజం, మెట్ పల్లి టౌన్ : మెట్ పల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో పారిశుధ్యం లోపించింది. స్వచ్ఛ మున్సిపాలిటీ కార్యక్రమం.. ప్రచార ఆర్బాటంలో తప్ప పరిసరాల శుభ్రతలో కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కూరగాయల మార్కెట్ లో చెత్తకుండీలు లేకపోవటంతో అమ్మకపుదారులు కుళ్ళిన కూరగాయాలను రోడ్డు పక్కన, మరికి కాలువల్లో పడేస్తున్నారు. దీంతో కుళ్ళిన వ్యర్థాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. మార్కెట్లో చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img