గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు సంజయ్‌దత్ ఇందులో విలన్‌గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే మూవీ టీమ్ ఆయనను సంప్రదించినట్లు సమాచారం. కథ, తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఆయన ఓకే అన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు, ‘కేజీయఫ్ 2’, ‘లియో’లో సంజయ్ విలన్‌గా కనిపించారు. ఆయా సినిమాలతో ఆయన తెలుగువారికీ దగ్గరయ్యారు. ప్రస్తుతం రామ్ నటిస్తోన్న ‘డబుల్ ఇస్మార్ట్’లో కీలకపాత్ర పోషిస్తున్నారు