ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇప్పటి వరకు ఆధిపత్యం చెలాయించిన రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు చతికిల పడుతోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ మరో మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. అయితే వైహాజ వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి కిందకి పడిపోయింది. సంజూ శాంసన్ సేన తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. మంగళవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కేప్టెన్ సంజు శాంసన్ ఒంటరిపోరాటం చేశాడు. ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 86 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్ ఔటైన తీరు సంచలనం రేపింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ నాలుగో బంతికి అతను ఔటయ్యాడు.
ముఖేష్ కుమార్ వేసిన ఒక డెలివరీ లాంగ్ ఆన్ వైపు భారీ షాట్ ఆడింది. అక్కడే పొంచి ఉన్న షై హోప్ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. ఆ సమయంలో అతని పాదాలు బౌండరీ లైన్‌ను టచ్ వాదన వినిపిస్తుంది. అయితే బంతిని అందుకున్న తర్వాత బౌండరీ లైన్ దాటి పడిపోబోతున్న షై హోప్.. కాపాడే క్రమంలో రోప్ కు సమాంతరంగా మూడుసార్లు పైకి ఎగిరాడు. ఆ క్రమంలో అతడి బూట్ల అంచు.. రోప్‌ను తగిలిందని భావించారు. అంపైర్ సంజూ శాంసన్ ఔట్ అని ప్రకటించాడు. కానీ సంజు శాంసన్ అంపైర్ తో ఆర్గ్యుమెంట్స్‌కు దిగాడు. కొద్దిసేపు వాదించాడు. క్రీజ్‌ను వదలడానికి ఇష్టపడలేదు. దీంతో సంజూ శాంసన్‌పై భారీ పెనాల్టీ పడింది. అతనికి చెల్లించే మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం అంపైర్లతో వాగ్వాదానికి దిగడం, ఔట్ ఇచ్చిన తర్వాత క్రీజు వదలకపోవడం వంటి చర్యలను ఉల్లంఘనలుగా పరిగణిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంజు మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించారు.