sankranthiki vasthunam : వెంకటేష్ హీరోగా నటించిన సినిమా ”సంక్రాంతికి వస్తున్నాం”(sankranthiki vasthunam ). ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగా సందర్భంగా విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాని ”శ్రి వేంకటేస్వర క్రియేషన్స్” బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజుకి భారీ షాక్ తగిలింది. తాజాగా ఈ సినిమాపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ సినిమా అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, ఐటీ, ఈడీ, జీఎస్టీతో విచారణ జరిపించాలని తెలిపారు.