గతేడాది‘చార్లీ’సినిమాతో కన్నడంలో బ్లాక్ బ్లస్టర్ కొట్టిన రక్షిత్ శెట్టికి అదే సినిమాతో తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. గత నెలలో రిలీజైన ‘సప్త సాగరాలు దాటి సైడ్–ఏ’సైతం తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. హేమంత్ ఎం. రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది. అయితే, ఈ మూవీ సెకండ్ పార్ట్ సప్త సాగరాలు దాటే– సైడ్ బీను తొలుత ఈ నెల 20న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు విడుదల తేదీని వాయిదా వేశారు. నవంబర్ 17న సెకండ్ పార్ట్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సప్తసాగరాలు సైడ్ ఏ(ఫస్ట్ పార్ట్) మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.