బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మరణం తరువాత అతనికి సంబందించిన అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ ల కూతురు సారా అలీఖాన్, సుశాంత్ ఇద్దరూ ప్రేమించుకున్నారని అతని స్నేహితుడు శామ్యూల్ హోకిప్ సంచలన విషయాన్ని వెల్లడించాడు. ‘కేదార్ నాథ్’ చిత్రం సమయంలో సుశాంత్, సారా ఇద్దరూ ప్రేమించుకున్నారని శామ్యూల్ చెప్పాడు. ఆ చిత్రం ప్రమోషన్ సమయంలో ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని తెలిపాడు. అయితే, సుశాంత్ తర్వాత చిత్రం ‘సోన్ చిరియా’ ఫ్లాప్ అయిన వెంటనే సుశాంత్ తో సారా విడిపోయిందని చెప్పాడు. ఆ విషయం తెలిసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని తెలిపాడు. బాలీవుడ్ మాఫియా కారణంగానే ఆ చిత్రం ఫ్లాప్ అయిందని చెప్పాడు.