HomeతెలంగాణSarees worth Rs crore seized in Bachupally బాచుపల్లిలో రూ.కోటి విలువైన చీరలు Seize

Sarees worth Rs crore seized in Bachupally బాచుపల్లిలో రూ.కోటి విలువైన చీరలు Seize

– రాష్ట్రంలో కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు

ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఎన్నిక‌ల అధికారులు, పోలీసులు క‌లిసి ప్ర‌తి వాహ‌నాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న డబ్బు, నగలు, డ్ర‌గ్స్, లిక్కర్​తో పాటు ఇత‌ర విలువైన వ‌స్తువుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక హైద‌రాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌లో కూడా పోలీసులు, మున్సిపల్ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. పంచవటి అపార్ట్‌మెంట్స్‌లోని ఓ ఫ్లాట్ వద్ద రూ.కోటి విలువైన చీరలను డంప్​ చేస్తుండగా పోలీసులు ప‌ట్టుకున్నారు. వరంగల్ నుంచి రెండు లారీల్లో చీర‌లను తీసుకువ‌చ్చిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఒక లారీలోని చీరలను అన్‌లోడ్ చేయగా, మరో లారీని పోలీసులు సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు.

Recent

- Advertisment -spot_img