మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చేసే లక్ష్యంతో రూ.5 లక్షల నుంచి రూ.60 లక్షల వ్యయంతో ప్రాజెక్టుల అమలుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలివిడతలో రూ.55 కోట్లతో 129 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం వ్యయంలో 35 శాతం ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. 10 శాతం లబ్ధిదారుని వాటా, మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణంగా అందిస్తుంది.