HomeసినిమాSarkaru Vaari Paata : వాయిదాప‌డ్డ‌ సర్కారువారి పాట

Sarkaru Vaari Paata : వాయిదాప‌డ్డ‌ సర్కారువారి పాట

Sarkaru Vaari Paata : వాయిదాప‌డ్డ‌ సర్కారువారి పాట

Sarkaru Vaari Paata : మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ రూపొందుతోంది.

మహేశ్ కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఈ సినిమాను ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

మహేశ్ మోకాలు సర్జరీ కారణంగా షూటింగును వాయిదా వేసుకున్నారు.

RadheShyam : రాధేశ్యామ్ సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డా

Mahesh Babu : సూపర్​స్టార్​ మహేశ్​బాబుకు కరోనా

మోకాలు సర్జరీ చేయించుకున్న మహేశ్, ప్రస్తుతం దుబాయ్ లో రెస్టు తీసుకుంటున్నాడు.

అయితే రీసెంట్ గా ఆయనకి కరోనా వచ్చింది.

మహేశ్ త్వరగా కోలుకున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆయన బయటికి రాకపోవచ్చని అంటున్నారు.

తన హెల్త్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకునే మహేశ్ ఇప్పట్లో షూటింగుకి రాకపోవచ్చని చెప్పుకుంటున్నారు.

ఇక మోకాలు సర్జరీ కారణంగా మహేశ్ బరువు తగ్గడం జరిగింది.

ఇటీవల త్రివిక్రమ్ – తమన్ తో దిగిన ఫొటోలోను ఆయన సన్నగా కనిపించాడు.

లుక్ తేడా రాకూడదు కనుక, ఆయన కాస్త బరువు పెరిగిన తరువాతనే మళ్లీ సెట్స్ పైకి రావొచ్చని అంటున్నారు.

అందువలన ఏప్రిల్ 1న ఈ సినిమా థియేటర్లకు రాకపోవచ్చని చెప్పుకుంటున్నారు.

Priyanka Chopra వీడియోకు ఫిదా అయిన‌ Samantha ఇంతకీ ఆ వీడియోలో ఏముంది

Acharya Movie : ఆచార్య నుంచి శానా కష్టం లిరికల్ వీడియో

Recent

- Advertisment -spot_img