తెలంగాణలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు రేవంత్ సర్కార్ దాదాపుగా సిద్ధమైందని తెలుస్తోంది. అప్పటిలోగా కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్ల అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 3 విడతల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు జరిపేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికీ పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం.. ఎన్నికల నిర్వహణలకు ప్రణాళికలు రచిస్తోంది.