Sarpanch Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎల్పీ సమావేశం నిర్వహించిన సీఎం.. ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. గ్రామాల్లో హామీల అడుగుకు ముందడుగు వేయాలని ఆదేశించారు. సీసీ రోడ్లు, ఆలయాలు, నిర్మాణ అనుమతులకు నిధుల మంజూరుకు మంత్రుల అనుమతి కోరాలన్నారు. బీసీలకు 42% స్థానిక సంస్థల పదవులు కేటాయించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు.
ALSO READ : రైతులకు గుడ్ న్యూస్.. యాసంగికి కూడా సన్నాలకు బోనస్..!