ఇదే నిజం, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో సర్పంచ్ ల ను అరెస్టు చేసిన పోలీసులు. ప్రజా సామ్య పద్ధతిలో ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులకు మెమోరాండం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్న మమ్మల్ని అర్థరాత్రి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని నల్లబెల్లి మండలం సర్పంచులు అన్నారు. సర్పంచ్ ల యొక్క పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచ్లను ఆదుకోవాలని లేకుంటే సామూహికంగా మా యొక్క పోరాటాన్ని ఉదృతం చేస్తామని అన్నారు.వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తుంది కాబట్టే భయపడి సర్పంచులను అరెస్టు చేసి ప్రజాస్వామ్య విధానాన్ని కూని చేస్తుంది. ఇప్పటికైనా స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులను ఆహ్వానించి సమస్యలు తెలుసుకుని బిల్లులు చెల్లించడానికి మార్గం ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము