Homeహైదరాబాద్latest Newsబీఎస్పీ మండల అధ్యక్షుడిగా సావనపల్లి రాజు ఏకగ్రీవం

బీఎస్పీ మండల అధ్యక్షుడిగా సావనపల్లి రాజు ఏకగ్రీవం

ఇదేనిజం, బెజ్జంకి : కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండల బీఎస్పీ మండల కమిటీ అధ్యక్షుడిగా సావనపల్లి రాజు నియమితులయ్యారు. మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు మాతంగి తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజు మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాల నుంచి పార్టీ కి తాను అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి అంకిత భావం తో పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండలం ఉపాధ్యక్షుడు మిట్టపల్లి రామచంద్రం, నిశాని రాజమల్లు, నిషాని సురేష్, గొడుగు శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img