ఇదేనిజం, మెట్ పల్లి: మెట్ పల్లి మండలం, బండాలింగాపూర్ గ్రామ చెరువును కాపాడాల్సిందిగా గురువారం గ్రామాభివృద్ధి కమీటి సభ్యులు నీటిపారుదల శాఖ అధికారికి పిర్యాదు చేశారు. ఈ చెరువును 500 ఎకరాల్లో తవ్వించి వేయి ఎకరాల కు సాగు, త్రాగు నీరు అందించేలా కాకతీయులు నిర్మించారన్నారు.కానీ కొందరు చెరువు 2 ఫిట్లా పోరు మత్తడి నాశనం చేశారని దాంతో చెరువు లోకి వచ్చిన నీరు వచ్చినట్టు గా బయటకు వెళ్ళిపోతుందని పిర్యాదు లో పేర్కొన్నారు. ఇకనైనా అధికారులు తమ చెరువు మత్తడి పునరుద్దరించి రక్షించాలని కోరుతున్నారు.