ఇదేనిజం, కరీంనగర్ క్రైం : ఆమె డాక్టర్లకే డాక్టర్ అట ! పేరుగడిచిన వైద్యులే చికిత్స కోసం తన వద్దకు వస్తారట !! మరి సదరు వైద్యం చేసే మహిళ ఏదైనా ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం నుంచి స్పెషలైజే షన్ కోర్సు చేసిందా ? అంటే అదీ లేదు. కేవలం తన వద్దకు వచ్చే వారి నాడి పట్టుకొని రోగం చెప్పేస్తుం దట. రోగులకు మరో రకమైన సేవలు కూడా సదరు మహిళ వద్ద దొరుకుతాయట. అవే మగ మహారాజు లను ఆకట్టుకునే మసాజ్, స్పా సర్వీసులు. ఇకపోతే బ్యూటీషియన్ కోర్సులు కూడా నేర్పిస్తానంటూ ప్రకటనలిచ్చి పలువురు యువతులను ముగ్గులోకి దింపుతోందట. ఇంకేముందీ ఓవైపు నాడీ వైద్యం.. ఇంకోవైపు మసాజ్, స్పాలతో సాంత్వన.. మరోవైపు బ్యూటీషియన్ సేవలతో ఆకర్షణ.. మొత్తానికి మూడు మసాజ్‌లు, ఆరు స్పాలు, డజన్ నాడీ థెరపీలు అన్న చందాన సదరు మహిళ వ్యాపారం వర్ధిల్లుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత యంత్రాంగం చోద్యం చూస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తు న్నాయి. వివరాల్లోకి వెళ్తే..
నాడీవైద్యంతో ఆకర్షణ
కరీంనగర్ లోని పద్మనగర్‌లో ఓ మహిళ అక్షిత కేరళ ఆయుర్వేదిక్ నాడి చికిత్సాలయం పేరిట ఆసుపత్రిని ప్రారంభించింది. మొదట ఆ ప్రాంతం లోని పలువురు యువతులు, మహిళలను ఆకర్షించి ఉచితంగా నాడీవైద్యం పేరిట చికిత్సలు ప్రారంభిం చింది. వారికి మందులు, నివారణోపాయాలు చెప్పి, వారికి కొంత ఉపశమనం కలగగానే, తన వ్యాపా రాభివృద్ధికి పురమాయించింది. ఇంకేముంది నాడీ వైద్యురాలి డైరెక్షన్ సదరు యువతులు, మహిళల పబ్లిసిటీ. వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ ఇలా ఎన్ని దారులుంటే అన్ని విధాలా ప్రచారం మొదలెట్టారు. తొలుత నాడీవైద్యం పేరిట జనాలను ఆకర్షించిన నాడీ థెరపీ శిరోమణి తర్వాత బ్యూటీకోర్సులు నేర్పబడును అంటూ యువతులను ముగ్గులోకి దింపే సీరియలకు శ్రీకారం చుట్టింది. ఇది నమ్మిన పలువురు నిజమే అనుకొని ఆమె దగ్గర కోర్సులో కూడా చేరినట్టు వినికిడి. మరి వారికి బ్యూటీషియన్ కోర్సు నేర్పుతున్నారా? మరేమైనా నేర్పుతున్నారా? అనేది సంబంధిత యంత్రాంగం విచారణ జరిపితే తెలుస్తుంది.
సుదూర ప్రాంతాల నుంచి రోగులు..
సదరు మహిళ చేసిన అడ్డగోలు ప్రచారం నిజమే అనుకున్న పలువురు సుదూర ప్రాంతాల నుంచి రావడం మొదలుపెట్టారు. మహారాష్ట్ర, తిరుపతి, ఖమ్మం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి తన వద్దకు వస్తుంటారని ఆమె స్వయంగా ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. వెన్నునొప్పి, మెడనరాల నొప్పి, షుగర్, థైరాయిడ్, ఫిట్స్, సంతానలేమి.. ఒకటేమిటి ఆమె నయం చేయలేని రోగాలే లేవట. కొసమెరుపు ఏమిటంటే ఎంతటి పెద్ద రోగాన్నైనా ఆమె శస్త్రచికిత్స లేకుండానే నయం చేసేస్తుందట. పాపం ఈ మాత్రం తెలియక చాలామంది లక్షలు, కోట్లు ఖర్చు చేసి వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు.
గతంలో సిరిసిల్లలో…
నాడీవైద్యం, బ్యూటీపార్లర్ పేరిట కరీంనగర్లో దుకాణం తెరిచిన సదరు మహిళ ఇదివరకు సిరిసి ల్లలోనూ ఇవే వ్యవహారాలు నడిపినట్లు తెలిసింది. అక్కడ కథ అడ్డం తిరగడంతో బిచాణాను కరీంన గర్‌కు మార్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ నాయకుడి అండదండలతో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా కొనసాగించినట్లు తెలిసింది. సిరిసిల్లలో బ్యూటీపార్లర్ సేవల పేరిట వివాదాస్పదమైన ఆమె ప్రస్తుతం నాడీ వైద్యం చేస్తున్న తీరు పేదప్రజల ప్రాణాల మీదకు తెచ్చేలా తయారైంది. సిరిసిల్ల, సిద్ది పేటతోపాటు పలుచోట్ల ఈ వ్యవహారం తన అనుచ రులతో కొనసాగిస్తున్నట్లు సమాచారం. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని అడ్డదారిలో డబ్బులు దండుకుంటూ కోట్లకు పడగలెత్తేందుకు వ్యూహర చన చేస్తోంది.
వైరల్‌గా మారిన వీడియో..
పెయిడ్ ప్రమోషన్లో భాగంగా సదరు మహిళ సుదీర్ఘనిడివితో తీయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయుర్వేదం, హో మియోపతి, అల్లోపతి అంటే అర్థమే తెలియదని, తనవి ఆయుర్వేద మందులేనని కూడా చెప్పలేనని ఇంటర్వ్యూలో పేర్కొనడం ఆమె అసలు వైద్యురాలే కాదనడానికి బలాన్నిచూకూరుస్తుంది.