స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండయా జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్‌కు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఆధారంగా అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా జూన్ 9 న పరీక్ష జరగనుంది. మొత్తం 8773 పోస్టులకు గాను ఏపీలో 525, తెలంగాణలో 50 ఖాళీలు ఉన్నాయి.