SC : ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ శాసనసభ ఆమోదించింది. 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. గ్రూప్-1లో అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1 శాతం రిజర్వేషన్లు, మాదిగలతో గ్రూప్-2లోని కులాలకు 9 శాతం రిజర్వేషన్లు, మాలలతో గ్రూప్-3లోని కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఈ బిల్లును రూపొందించారు. కాంగ్రెస్ పార్టీ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎస్సీలకు అనేక అవకాశాలు కల్పించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2026 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత, ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను పెంచుతాము సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.