Schedule for Huzurabad by election : తెలంగాణలోని హుజూరాబాద్ ( Huzurabad by elections)ఎన్నికతోపాటు ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
అక్టోబర్ ముప్పైన ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (cec)షెడ్యుల్ వెల్లడించింది.
కాగా ఇందుకోసం అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినాషన్ దాఖలుకు అక్టొబర్ 8, ఉప సంవసంహరణకు అక్టొబర్ 13గా పేర్కొంది.
30 ఎన్నికలు నిర్వహించనుండగా.. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి..
హుజూరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని(ap) బద్వేలు నియోజకవర్గానికి కూడా అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరగనుంది.
ఇక దేశ వ్యాప్తంగా మరో 28 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కూడా ఇదే షెడ్యూల్ విడుదల చేసింది.
ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.