కాప్రా, ఇదే నిజం: స్కీమ్ వర్కర్ల రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రెండవ రోజు అయిన ఈరో ఆశా వర్కర్లు కాప్రా మండల ఆఫీస్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో తమని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 21 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ సమ్మెలో భాగంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఈజీ శ్రీనివాసులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పౌష్టికాహారం విద్య వైద్యం తదితర సేవలను అందిస్తున్న వివిధ సేవల్లో పనిచేస్తున్న అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం ఎంహెచ్ఎం, సర్వ శిక్ష అభియాన్, ఇందిరా క్రాంతి పథకం తదితర తదితర స్క్రీన్లలో దేశవ్యాప్తంగా కోటి మంది కార్మికులు పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది పనిచేస్తున్నారు. వీరందరినీ కార్మికులుగా గుర్తించాలని వీరికి కనీస వేతనం 21 వేల రూపాయలు ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. వీరికి ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, 45వ ఇండియన్ లేబర్ సిఫారసులను అమలు చేయాలని ప్రభుత్వ ప్రైవేటు మౌలిక సదుపాయాలు కల్పించాలని, అంతేకాకుండా కరోనా నివారణ చర్యల్లో ముందువరుసలో ఉండి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నారు. వీరికి రక్షణ కల్పించాలని, కరోనా సమయంలో చనిపోయిన స్కీం వర్కర్ల కుటుంబాలకి 50 లక్షలు ఇన్సురెన్సు ఆ కుటుంబ సభ్యులకు ఉచితంగా కరోనా చికిత్స చేయాలని రెడ్ జోన్ లో పనిచేస్తున్న వారికి పీటీసీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఖాళీగా ఉన్న డాక్టర్స్, నర్సుల, యుపి ఇతర సిబ్బంది పోస్టులను పోస్ట్లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విస్తృతంగా కరోనా టెస్టులు నిర్వహించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ , నాయకులు పి వెంకట్, ఎం శ్రీనివాసరావు, లలిత తదితరులు పాల్గొన్నారు.