Homeఫ్లాష్ ఫ్లాష్పథకాలు ‘డబుల్’​

పథకాలు ‘డబుల్’​

– అబ్బురపరిచేలా బీఆర్ఎస్​ మేనిఫెస్టో
– అన్నదాతలకు పింఛన్​ ?
– రైతుబంధు 15 వేలు
– కల్యాణలక్ష్మి రెట్టింపు
– గులాబీబాస్​ చాణక్యం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలను ఇరుకున పెట్టేలా మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థులను అందరికంటే ముందే ప్రకటించి ఆశ్చర్యపరిచిన కేసీఆర్​ మేనిఫెస్టో మాత్రం ఇంతకాలం ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ మెనిఫోస్టో ప్రకటించి జనంలోకి వెళ్లిన అనంతరం తాజాగా సీఎం కేసీఆర్​ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. కాంగ్రెస్ కు దీటుగా పథకాలు ప్లాన్​ చేస్తున్నారు. కేసీఆర్​ అమలు చేస్తున్న హామీలను కాస్త పెంచి కాంగ్రెస్​ 6 గ్యారెంటీలు ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్​ కాంగ్రెస్ హామీలను తలదన్నేలా హామీలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. రైతు బంధును రూ. 15 వేలు చేయబోతున్నట్టు సమాచారం. మరోవైపు కల్యాణ్​ లక్ష్మి సాయం కూడా రూ. 2 లక్షలు చేయబోతున్నట్టు టాక్​. వీటికి తోడు ఆసరా, వికలాంగులు పింఛన్ మొత్తాన్ని కూడా పెంచబోతున్నారు. అయితే ఈ సారి కొత్తగా రైతుల కోసం పింఛన్​ పథకాన్ని తీసుకురాబోతున్నట్టు సమాచారం.

ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్​ మెనిఫోస్టో మీదే ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ నెల 15న కేసీఆర్​ మేనిఫోస్టోలో ఏయే అంశాలు ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ హామీల కంటే .. సీఎం కేసీఆర్​ ప్రకటించబోయే మేనిఫెస్టో ప్రజలకు నమ్మకం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చాడు గనక ప్రస్తుతం ఆయన ఇవ్వబోయే హామీలకు విలువ ఉండే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పింఛన్​, రైతు బంధు వంటి పథకాలు ఎంత మొత్తం ఇస్తాయో చెప్పేశాయి కనక ముఖ్యమంత్రి మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం మార్చే చాన్స్​ ఉండదు. మొత్తానికి సీఎం కేసీఆర్​ మేనిఫెస్టో ప్రకటన విషయంలో చాణక్యం ప్రదర్శించారు.

Read More :

Dalit Bandhu కోసం లంచం అడిగితే బట్టలు ఊడదీయిస్తా
http://idenijam.com/if-a-dalit-bandhu-asks-for-a-bribe-for-a-relative-he-will-be-stripped-of-his-clothes/

Recent

- Advertisment -spot_img