School Holidays: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గుడ్‌ఫ్రైడే సందర్భంగా రేపు (ఏప్రిల్ 18) జనరల్ హాలిడే ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. బ్యాంకులు, కొన్ని కేంద్ర సంస్థలు కూడా ఈ రోజు పనిచేయవు. శనివారం (ఏప్రిల్ 19) పలు కార్పొరేట్ కంపెనీలకు సెలవు కాగా, ఆదివారం (ఏప్రిల్ 20) సాధారణ సెలవు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా మూడు రోజుల సెలవు దక్కనుంది. విద్యార్థులు సంబరాలు చేసుకుంటుండగా, ఉద్యోగులు కూడా విశ్రాంతి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సెలవులతో కుటుంబ సమేతంగా సమయం గడపడానికి అవకాశం లభించనుంది.