ముందుగా 9-12 తరగతులకు మాత్రమే
కంటైన్మెంట్ జోన్ల నుంచి ఎవరూ రావొద్దు
నిబంధనలను విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీః సెప్టెంబర్ 21 నుంచి స్కూళ్లు రీ ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముందుగా 9 నుంచి 12 తరగతుల వారికే స్కూళ్లు తెరవడానికి అనుమతి ఇచ్చింది. స్కూళ్లు తెరిచే సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉండే స్కూళ్లు మాత్రమే తెరవాలి. కంటైన్మెంట్ జోన్లలో ఉండే టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది ఎవరూ స్కూల్‌కు రాకూడదు.
నింబంధనలు ఇలా ఉన్నాయి..
స్కూల్లో విద్యార్థులు, టీచర్లు వినియోగించే ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి.
ఇప్పటి వరకు క్వారంటైన్ సెంటర్లుగా వినియోగించే స్కూళ్లను మరింత శుభ్రంగా, డీప్ క్లీనింగ్ చేయాలి.
స్కూల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 50 శాతానికి మించి రాకూడదు.
బయోమెట్రిక్ అటెండెన్స్ కాకుండా రిజిస్టర్ హాజరు తీసుకోవాలి.
స్కూల్లో క్రీడలు, మార్నింగ్ అసెంబ్లీ లాంటివి నిషేధం.
ప్రతి స్కూల్లోనూ రాష్ట్ర కోవిడ్ 19 హెల్ప్ లైన్ నెంబర్ విధిగా అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి.
ఆన్ లైన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కొనసాగించవచ్చు.
స్కూళ్లకు వచ్చిన వారి మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలి.
ఫేస్ మాస్క్‌లు, ఫేస్ కవర్లు తప్పనిసరి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి.
ఆల్కహాల్ ఉండే శానిటైజర్లు మాత్రమే వాడాలి.
దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు చేతులు, కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి.
ఎవరి ఆరోగ్యం వారు జాగ్రత్తగా చూసుకోవాలి.
ఏదైనా అనారోగ్యం అనిపిస్తే వెంటనే ఇతరులకు తెలియజేయాలి.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం పూర్తిగా నిషేధం.