తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్‌లో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి, మార్చి, ఏప్రిల్‌లో మరింత ముదిరాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ చేసారు. నేటి నుంచి రానున్న మూడు రోజుల పాటు ఇదే తీవ్రత ఉండనుంది.