Homeఆంధ్రప్రదేశ్వెన‌క్కి త‌గ్గిన ఎస్ఈసీ

వెన‌క్కి త‌గ్గిన ఎస్ఈసీ

SEC made a sensational decision on the issue of color of ration distribution vehicles in AP. The ration was reduced back on the color change of the vehicles. Withdrew the orders to change the color of the vehicles. With this, the petition was disposed off. While the SEC directed to change the colors of ration vehicles, the government challenged it in the high court. The SEC decision turned out to be interesting.

వైఎస్సార్‌సీపీ జెండా రంగుల్ని మార్చాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.. ఫిబ్రవరి 5న ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది.

ఏపీలో రేషన్ పంపిణీ వాహనాల రంగుల వ్యవహారంపై ఎస్ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది.
రేషన్ వాహనాల రంగు మార్పుపై వెనక్కి తగ్గింది. వాహనాల రంగు మార్చాలన్న ఆదేశాలను వెనక్కు తీసుకుంది.. దీంతో పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.
రేషన్ వాహనాలకు రంగులు మార్చాలని ఎస్ఈసీ ఆదేశాలు ఇవ్వగా.. ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.
ఎస్ఈసీ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పరిశీలించారు.
వైఎస్సార్‌సీపీ జెండా రంగుల్ని మార్చాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.. ఫిబ్రవరి 5న ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
దీనిపై జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఇంటింటికీ రేషన్‌ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరింది.
ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్షంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
వాహనాల రంగులు మార్చాలంటే 3నెలల సమయం పడుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
భారీగా ఖర్చవుతుందని.. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది అన్నారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేసింది.
ఇంటింటికీ రేషన్‌ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని జగన్ సర్కార్ కోర్టును కోరింది.
ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే పథకం ప్రారంభించామని.. దీన్ని అడ్డుకోకుండా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరారు.
వాదనలు విన్న కోర్టు ఆ ఆదేశాలను సస్పెండ్ చేసింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది.
ఇప్పుడు ఆదేశాలను వెనక్కు తీసుకుంది.

Recent

- Advertisment -spot_img