సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 2 కిలో మీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. అటు వైపుగా వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.