Homeక్రైం100 కేజీల గంజాయి పట్టివేత

100 కేజీల గంజాయి పట్టివేత

హైదరాబాద్​–ఇదేనిజం : అక్రమంగా గంజాయి తరలించిన కేసులో 5గురిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు పోలీసులు. కేసు వివరాలను నగర టాస్క్​ఫోర్స్​ డీసీపీ రాధకిషన్​రావు, వేస్ట్​జోన్​ టాస్క్​ఫోర్స ఇన్​స్పెక్టర్​ గట్టుమల్లుతో కలిసి వివరాలను వెల్లడలించారు.  5గురు యువకులు కలిసి ఒక మూఠాగా ఏర్పడి ఏజేన్సీ ప్రాంతం నుంచి గంజాయిని నగరానికి ఆక్రమంగా తరలించి వాటిని నగరంలో అవసరమైన వారికి అందిస్తున్నారన్న పక్కా సమాచారంతో నిఘా వేసి టప్పాచబుత్ర బస్​స్టేషన్​ సమీపంలో మాటు వేసి నిఘాఉంచారు. ఆయితే ఆదారిలో ఒక స్వీఫ్ట్​ వాహానం వేగంగా రావడంతో వేంటనే ఆపి సోదా చేయగా అందులో 5గురు యువకులు ఆషీష్​సింగ్​(42), సుమీత్​ముకాడీయా(35),రమావత్​మోతిలాల్​(30),రమావత్​విజవయ్​(29), రాజ్​కుమార్​(35) తదితరులుపట్టుబడ్డారు. వారి వద్దనుంచి 100 కేజీల భారీ గంజాయి, 7 సెల్​ఫోన్​, ఒక స్వీఫ్ట్​ వాహానం స్వాధీనంచేసుకుని రిమాండ్​కు తరలించారు. అయితే పోలీసుల విచారణలో ఆశిష్​సింగ్​ పాతనేరస్థుడని గతంలో గుడుంబ రవాణ చేసే వాడని దర్యాప్తులో తెలింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img