Homeహైదరాబాద్రేషన్​ బియ్యం అక్రమనిల్వల పట్టివేత

రేషన్​ బియ్యం అక్రమనిల్వల పట్టివేత

అక్రమంగా రేషన్ బియ్యం నిలువ ఉంచిన ఇంటిపై ఎస్ ఓ టి పోలీసుల దాడి
ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని మల్కాజ్గిరి పోలీసులకు అప్పగింత

నేరేడ్ మెట్, ఇదేనిజం : మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి దాదాపు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆదివారం ఎస్ ఓ టి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. మల్కాజిరి సర్కిల్ పరిధిలోని సాయి నగర్ కు చెందిన షేక్ గులాబ్ (60) బి జె ఆర్ నగర్ షేక్ ఇర్ఫాన్ లు ఇద్దరు కలిసి కొంతమంది వ్యక్తులను పెట్టి ఆయా ప్రాంతాల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి సేకరిస్తుంటారు.తక్కువ ధరకు కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తాలలో నిల్వ ఉంచి రైస్ మిల్లులకు ఇతర కంపెనీలలో ఎక్కువ ధరకు అమ్మకాలు జరుపుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎస్ ఓ టి పోలీసులు వలపన్ని దాడి చేశారు. రేషన్ బియ్యంతో పాటు షేక్ గులాబ్ షేక్ ఇర్ఫాన్ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img