ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 1000కు పైగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఐపీఎల్ టిక్కెట్లను విక్రయిస్తున్న నిందితులు రమణ (బెంగళూరు), శామ్యూల్ (హైదరాబాద్)లను పోలీసులు అరెస్టు చేశారు. 101 ఐపీఎల్ టిక్కెట్లు, రెండు సెల్ ఫోన్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు హైదరాబాద్-బెంగళూరు మ్యాచ్ టిక్కెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.