Homeహైదరాబాద్latest Newsరోడ్డు ప్రమాదంలో సీనియర్ నటి కన్నుమూత

రోడ్డు ప్రమాదంలో సీనియర్ నటి కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగులో ‘త్రినాయని’ సీరియల్ తో పాపులర్ అయిన కన్నడ నటి పవిత్రా జయరామ్ కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో పవిత్ర స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. కన్నడలో ‘రోబో ఫ్యామిలీ’ అనే సీరియల్ తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో మొదటగా ‘నిన్నేపెళ్లాడతా’ అనే సీరియల్ లో నటించారు.

Recent

- Advertisment -spot_img