Homeహైదరాబాద్latest Newsరేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో.. సీనియర్లు లబో..దిబో..!

రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో.. సీనియర్లు లబో..దిబో..!

  • ఇష్టారాజ్యంగా జాయినింగ్స్
  • కాంగ్రెస్ లో బయటి లీడర్ల హవా
  • ఇప్పుడు జీవన్ రెడ్డి.. రేపు ఎవరు?
  • వ్యక్తిగత ఇమేజ్ కోసం రేవంత్ పాకులాట..
  • ఎక్కడికక్కడ సీనియర్ లీడర్లకు చెక్
  • సొంతవర్గాన్ని పెంచి పోషించుకుంటున్న ముఖ్యమంత్రి
  • గతంలో సొంతంగా ఎదిగిన లీడర్లతో కాంగ్రెస్ పార్టీకి నష్టం
  • తెలంగాణలో అదే సీన్ రిపీట్ కాబోతుందా?

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ..దేశంలో ఎక్కడైనా ఆ పార్టీకి ఓ విధానం ఉంటుంది. హస్తం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆపార్టీకంటూ ప్రత్యేకంగా ఓ రాజ్యాంగం ఉంటుంది. ఎవరైనా దాన్ని పాటించాల్సిందే. ఏరాష్ట్రంలోనైనా ఇదే దృశ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సరికి కాస్త భిన్నమైన వాతావరణం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓ ప్రాంతీయపార్టీగా మార్చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ఓ ప్రాంతీయపార్టీ అధినేతగానే వ్యవహరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు.. సీనియర్ నేతలకు కనీస సమాచారం ఇవ్వడం లేదు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో? ముఖ్యనేతలకు కూడా తెలియడం లేదు. ఇంత సీక్రెట్ గా వ్యవహారాలు నడుస్తున్నాయి. అయితే హైకమాండ్ కు ఈ విషయం తెలిసినా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. రేవంత్ పార్టీని బలోపేతం చేస్తున్నారు.. ఆయన ఎవరిని చేర్చుకుంటే మాకేంటి? చెప్పి చేస్తే ఏంటి? చెప్పకుండా చేర్చుకుంటూ ప్రాబ్లమ్ ఏంటి? అన్న ధోరణిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందా? అన్న డౌట్స్ వస్తున్నాయి. ఇక రేవంత్ ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహారం నడుస్తోంది.

అంతా బయటినేతల పెత్తనమే..
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు బయటి నేతల పెత్తనమే కనిపిస్తోంది. చేరికల్లో ఎక్కడ చూసినా రేవంత్, పొంగులేటి ఇద్దరే కనిపిస్తున్నారు. అయితే చేరికల విషయంలో, సంచలన నిర్ణయాల విషయాలన్నీ రేవంత్, పొంగులేటి సమక్షంలో నడుస్తున్నట్టు సమాచారం. వీరిద్దరూ కాంగ్రెస్ జీన్స్ ఉన్న లీడర్లు కాదు.. ఒకరిదేమో తెలుగుదేశం నేపథ్యం.. మరొకరిది వైఎస్సార్సీపీ ప్రాపకం. ఇప్పుడు వారే ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగామారారు. సహజంగా కాంగ్రెస్ పార్టీలో వన్ మ్యాన్ షో ఉండదు. అంతా సమష్టి రాజకీయమే. కానీ రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ కల్చర్ కనుమరుగైంది. తెలంగాణ కాంగ్రెస్ ఓ ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. ఇప్పటికే ఈ విషయంపై వీహెచ్ కూడా విమర్శలు గుప్పించారు. రేవంత్ కేవలం తన సొంతసైన్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని.. ఇదేపరిస్థితి కొనసాగితే..మరో వైఎస్, శరద్ పవార్, లాగే రేవంత్ కూడా అటువంటి లీడర్ గా మారే చాన్స్ ఉందని కాంగ్రెస్ హైకమాండ్ అనుమానించే చాన్స్ ఉంది.

జీవన్ రెడ్డి రూపంలో చిన్న ఝలక్
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కనీసం సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి ఎప్పటికైనా ముప్పు పొంచి ఉండేది ఈ సీనియర్ లీడర్లతోనే .. అందుకే వారిని పొగబెట్టి బయటకు పంపించే వ్యూహం పన్నుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన వర్గం ఎమ్మెల్యేలను తయారు చేసుకున్న రేవంత్.. కొన్ని రోజుల్లో మరింత స్ట్రాంగ్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది. పార్టీని బలోపేతం చేస్తానని చెబుతున్న రేవంత్ తను బలోపేతం అవుతున్నాడు. ఒకవేళ జాతీయ పార్టీలో వ్యక్తులు బలపడితే చివరకు హైకమాండ్ ను ఎదురిస్తారు.

నాడు ఏమన్నారు? ఇప్పుడేం చేస్తున్నారు?
ఇక రేవంత్ రెడ్డి గతంలో ఫిరాయింపుల గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పార్టీ ఫిరాయించినళ్లను రాళ్లతో కొట్టాలని.. అటువంటి ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని గతంలో రేవంత్ విమర్శించారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమికి గల కారణాల్లో ఫిరాయింపులు కూడా కారణమే. అందుకే రేవంత్ తొందరపడొద్దని వాళ్లు సూచిస్తున్నారు. ఇక నుంచైనా చేరికల కోసం ఓ కమిటీ వేయాలని.. సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డికి అధిష్ఠానం అశిస్సులు ఫుల్ గా ఉన్నదెవరికి? అన్నది వేచి చూడాలి.

రేవంత్ సీఎం సీటుకోసమేనా? ఈ తాపత్రయం!
అసలు రేవంత్ ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు? అన్న ప్రశ్నలు అందరి మెదడును తొలుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 65 ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ ఇదే. అయితే రేవంత్ కేవలం తన సొంత ప్రాబల్యం పెంచుకొనేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ బలోపేతం కావాలంటే ఓ కమిటీ వేయాలన్నది సీనియర్ల డిమాండ్. ఈ కమిటీ నిర్ణయం ప్రకారం పదవుల పోస్టింగ్ దక్కితే వారు హైకమాండ్ కు విధేయులుగా ఉంటారు. లేదంటే వారంతా రేవంత్ మొహం చూసి వెళ్లిన వారు. ఇక రేవంత్ తన వ్యక్తిగత ఇమేజ్ కోసమే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా రేవంత్ వ్యవహార శైలితో సీనియర్లు లబో దిబో అంటున్నారు. రేవంత్ రెడ్డికి తన ముఖ్యమంత్రి పదవి మీదున్న మోజు.. కాంగ్రెస్ భవితవయం మీద లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img