Homeహైదరాబాద్latest Newsకామారెడ్డి జిల్లాలో సంచలనం.. చెరువులో దూకి ఎస్సై, మరో ఇద్దరు ఆత్మహత్య.. కారణం అదేనా..?

కామారెడ్డి జిల్లాలో సంచలనం.. చెరువులో దూకి ఎస్సై, మరో ఇద్దరు ఆత్మహత్య.. కారణం అదేనా..?

ఇదే నిజం, కామారెడ్డి: రాష్ట్రంలో సంచలనం రేపిన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ ఎస్ఐ సూసైడ్ కథ విషాదాంతమైంది. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ ఎస్ ఐ సాయి కుమార్ (31 ) కామారెడ్డి శివారులోని అడ్లుర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గురువారం ఉదయం విగత జీవిగా గజఈతగాళ్లు వెలికి తీశారు. బుధవారం రాత్రి నుంచి పోలిస్ శాఖ పెద్ద చెరువులో రెస్క్యూ ఆఫరేషన్ చెపట్టిన విషయం విధితమే. బిక్కనూర్ ఎస్సై సాయి కుమార్ (31), బిబి పేట్ పోలిస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న శ్రుతి ( 32), బిబి పేట్ లోని సోసైటిలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న నిఖీల్ (28) లు బుధవారం మధ్యహ్నమే పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం 11 గంటల తరువాత ఎస్ఐ పోన్ స్విచ్చాఫ్ రావడం, విధులు నిర్వహించుకుని ఇంటికి వేళ్లిన కానిస్టేబుల్ శ్రుతి పోన్ స్విచ్చాప్ రావడంతో పోలిసులు టవర్ లోకేషన్ ద్వారా ఇద్దరు కూడా పెద్ద చెరువు వద్ద కలిసినట్లు గుర్తించారు. అక్కడ ఎస్ఐ కి సంబందించిన కారు లభ్యమైన సెల్ పోన్ దోరకలేదు. అది స్విచ్ఛాప్ రావడం అక్కడ నిఖిల్, శ్రుతికి సంబందించిన సెల్ పోన్, చెప్పులు ఇతర సామాగ్రీ గుర్తించారు.
రాత్రే దొరికిన ఇద్దరి డేడ్ బాడిలు…
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పెద్ద చెరువులో ఎస్సై, కానిస్టేబుల్, మరొకరు సూసైడ్ కేసులను చేదించేందుకు కామారెడ్డి ఎస్పీ సిందు శర్మ అధ్వర్యంలో పోలీస్ శాఖ రిస్క్యూ ఆఫరేషన్ చేపట్టారు. రాత్రే శ్రుతి, నికిల్ డేడ్ బాడిలు లభ్యమయ్యాయి. కాని ఎస్ డేడ్ బాడి దొరక్కపోవడంతో మిస్టరిగా మారింది. గురువారం తెల్లవారు జామున గాలింపు చర్యలు చెపట్టగా ఎస్సై డెడ్ బాడి దొరక్కడంతో ముగ్గురి ఆత్మహత్యగా నిర్థారణ అయింది.
ముగ్గురి ఆత్మహత్య కు … అదే కారణమా..?
ఎస్సై, కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఎస్సై, కానిస్టేబుల్ కు మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరికి నిఖిల్ మధ్యవర్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరు ముగ్గురు ఎక్కడ కలిశారు? వీరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా.. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టుగా సమాచారం. కానిస్టేబుల్ శ్రుతి స్వగ్రామం గాంధారి మండల కేంద్రం. 10 సంవత్సరాలుగా పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులు, చెల్లె, తమ్ముడు ఉన్నారు. శ్రుతికి గతంలో పెళ్లయినప్పటికీ వ్యక్తిగత కారణాలవల్ల ఐదు సంవత్సరాల క్రితం భర్తతో విడాకులు తీసుకుని, ఒంటరిగా ఉంటున్నట్లు తెలిసింది.

Recent

- Advertisment -spot_img