అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, సమంతలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.తన ఇమేజ్‌ను, కుటుంబ పరువును దెబ్బతీసినందుకు కొండా సురేఖపై నాగార్జున 100 కోట్లకు పైగా పరువు నష్టం దావా వేశారు. అయితే కొండా సురేఖపై అక్కినేని నాగార్జున పరువునష్టం దావాపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పరువు లేని నాగార్జున పరువు నష్టం దావా వేయడం’ హాస్యాస్పదంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. సమంత లాంటి వాళ్లు కేసు పెట్టినా ఓ అర్థం ఉంటుందని నారాయణ అన్నారు. కొండా సురేఖ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా కోర్టుకు వెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు.