‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ బిల్లుకు కేంద్రం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన నియమించిన కమిటీ నివేదికకు NOD ఇచ్చింది. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే స్థానిక, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఏకకాలం(100 రోజుల వ్యవధి)లో EC నిర్వహిస్తుంది.