సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 24 రోజులుగా వారు విధులకు రాకపోవడాన్ని సీరియస్ గా తీసుకుంది. వారిని క్రమబద్ధీకరించడం లేదా విద్యా శాఖలో విలీనం చేయడం న్యాయపరంగా కుదరదనే అభిప్రాయంలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. విధులకు హాజరుకాకుండా సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.