ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. నేడు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాకి సాయి ధరమ్ తేజ్, నాగబాబు తమ సపోర్ట్ తెలిపారు. ఈ క్రమంలో మెగా vs అల్లు ఫ్యాన్స్ వార్ కి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ అనుకున్నారు.అయితే ఈ సినిమాలోని ఒక డైలాగ్ తో మెగా వార్ ఇంకా రాజుకుంది. ఈ సినిమాలోని ఓ డైలాగ్ సంచలనంగా మారింది. ఈ డైలాగ్ మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పరోక్షంగా రాశారు. ఎన్నికల సమయంలో అల్లుఅర్జున్ తన స్నేహితుడు శిల్పా రవి కోసం నంద్యాల వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై చాలా వివాదాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ‘నీకు నేనా బాస్.. ని బాస్ కి కూడా నేనే బాస్’.. అంటూ పుష్పరాజ్ చెప్పే డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవిని మాత్రమే అందరు బాస్ అని పిలుస్తారు. అలాగే ‘తిరుపతి లడ్డు’ డైలాగ్ కూడా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి అనే ఫాన్స్ అంటున్నారు. ఈ డైలాగ్ మెగా ఫ్యామిలీకి కౌంటర్‌గా అల్లుఅర్జున్ చెప్పాడని మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.