Homeహైదరాబాద్latest Newsమైనర్‌ బాలిక రేప్ కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి ఊహించని షాక్

మైనర్‌ బాలిక రేప్ కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి ఊహించని షాక్

మైనర్‌ బాలిక రేప్ కేసులో ఎల్బీ నగర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2017లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్‌‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు మహ్మద్ కాజా మొయినుద్దీన్ (19)కు పదేళ్ల శిక్ష జైలు శిక్ష మరియు రూ. 11,000 జరిమానా., బాధితురాలికి రూ.1,00,000 పరిహారం వెంటనే చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. మే 2017లో సరూర్‌నగర్‌‌ లోని కర్మాన్‌ఘాట్‌ కు చెందిన 19 ఏళ్ల ఓ ప్రైవేట్ ఉద్యోగి మహ్మద్ ఖాజా మొయినుద్దీన్ అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను చాక్లెట్ కోసం అని చెప్పి తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఖాజా మొయినుద్దీన్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక చివరగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈరోజు తుది తీర్పును ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img