హైదరాబాద్: సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. శ్రావణి ఆత్మహత్యకు కారణం అవమానమా లేక ప్రేమ వ్యవహారమా అన్న చర్చ జరుగుతోంది. ఫ్యామిలీ ఫ్రెండ్ సాయి కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజు, దేవరాజు మోసం చేయడంతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని సాయి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. వాస్తవం ఏమిటన్నది పోలీసులు విచారణలో ఎలాగూ తెలుతుంది కాబట్టి అప్పటి వరకు ఓపిక పట్టాల్సిందే. శ్రావణి ఆత్మహత్య కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
తన ప్రేమలో శ్రావణి కూరుకుపోయిందని, తాను రమ్మంటే ఇంట్లో నుంచి క్యాష్, గోల్డ్ తీసుకోని వచ్చేస్తానని తనతో చెప్పిందని దేవరాజు తెలిపాడు. దీంతోపాటు సాయి అనే వ్యక్తిని పెండ్లి చేసుకోమని తనన బలవంతం చేస్తున్నారని, ఇదే విషయంపై నడిరోడ్డుపై శ్రావణిపై దాడికూడా చేశారని, ఆ అవమానంతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుంటానని తనతో ఫోన్‌లో చెప్పిందని దేవరాజు చెప్పాడు. శ్రావణి కాల్ రికార్డింగ్ క్లిప్స్ పోలీసుల ముందుంచుతానని దేవరాజు తెలిపాడు.
దేవరాజురెడ్డి చెప్పే విషయాలు అవాస్తవమని సాయి కొట్టిపారేశాడు. తాను శ్రావణికి ఫ్యామిలీ స్నేహితుడినని, శ్రావణి చనిపోయినప్పటి నుంచి మృతదేహంతోనే ఉన్నానని తెలిపాడు. తాను ఎక్కడికి పారిపోలేదని, పోలీసులతోనే ఉన్నానని సాయి వెల్లడించారు.
శ్రావణి ఆత్మహత్యకు కారణం సాయా.. దేవరాజా?
RELATED ARTICLES