యూపీలోని బరేలీ జిల్లాలో సీరియల్ కిల్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం అరెస్ట్ చేశారు. కుల్దీప్ గంగావర్ అనే వ్యక్తిని చిన్నతనంలో సవతి తల్లి చిత్రహింసలు పెట్టింది. ఇక అతడి భార్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఇవన్నీ మహిళల పట్ల అతడిలో ద్వేషాన్ని పెంచాయి. ఇక ఒంటరి మహిళలను అతడు టార్గెట్ చేసే వాడు. శృంగారానికి సహకరించకుంటే చెరకు తోటల్లోకి తీసుకెళ్లి చంపేవాడు. ఇలా 14 నెలల్లో 9 మంది మహిళలను హత్య చేశాడు.