Homeజిల్లా వార్తలుజోనల్ కమీషనర్ ను కలిసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్  రాగం నాగేందర్ యాదవ్

జోనల్ కమీషనర్ ను కలిసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్  రాగం నాగేందర్ యాదవ్

ఇదేనిజం,శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉపేందర్ రెడ్డిని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్పొరేటర్ తో పాటు మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, కృష్ణారెడ్డి ఉన్నారు. ఈ సందర్బంగా కార్పొరేటర్  మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జోనల్ కమీషనర్ తో చర్చించామని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు.

Recent

- Advertisment -spot_img