హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాస్పిటల్ లోపలికి వెళ్లేందుకు యత్నించిన వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలపై అధ్య యనం చేసేందుకు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కమిటీ సభ్యులు ఆస్పత్రి పరిశీలనకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోగా.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.